Bollywood actor Govinda joins Shiv Sena: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా శివసేన పార్టీలో చేరారు. గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో ఆయన శివసేన కండువా కప్పుకున్నారు. పాలిటిక్స్ లోకి రీఎంట్రీపై ఇటీవల ఏక్‌నాథ్ షిండేతో గోవిందా చర్చలు జరిపారు. తాజాగా అదే పార్టీలో చేరారు. గోవిందా ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయాల్లో గోవిందాకు 'జెయింట్ కిల్లర్' అనే పేరు ఉంది. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అది కూడా ఐదుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ అగ్రనేత రామ్ నాయక్‌పై. ఈ విజయం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపు అనే చెప్పాలి. గోవింద ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ముంబై నార్త్ ప్రస్తుతం బీజేపీకి కంచుకోటగా ఉంది. అక్కడ శివసేన గెలవడం అంటే ఆషామాషీ కాదు. ఈ క్రమంలో ఏక్ నాథ్ షిండే తెలివిగా గోవిందాను బరిలోకి దింపుతున్నారు. ఈ బాలీవుడ్ హీరో రీఎంట్రీతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. 


ఏప్రిల్ 19 నుంచి పోలింగ్..
దేశంలో 48 లోక్‌సభ స్థానాలతో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2024 సార్వత్రిక ఎన్నికలను ఐదు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 నుండి మే 20 వరకు ఎన్నికలు జరగనున్నాయి, రెండవ దశ ఓటింగ్ సందర్భంగా అకోలా వెస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13 మరియు మే 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది, ముంబైలోని మొత్తం ఆరు నియోజకవర్గాలకు ఐదో దశలో ఓటింగ్ జరుగుతుంది. 2019లో నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, 2014లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి.



Also Read: Arvind Kejriwal Arrest: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన లెఫ్ట్ నెంట్ గవర్నర్..


Also Read: CM Bhagwant Mann: యాభై ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు తండ్రైన సీఎం.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


.